Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ పిచాయ్‌తో కేటీఆర్ భేటీ...

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (21:15 IST)
రెండవ రోజు దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి కే. తారకరామారావు పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల సిఈవోలు, గ్రూప్ చైర్మన్లు పాల్గొన్నారు. దావోస్‌లో జరిగిన ఒక బిజినెస్ మీటింగ్‌లో గూగుల్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు.
 
హైదరాబాద్ నగరంలో గూగుల్ కార్యకలాపాలతో పాటు, దాని భవిష్యత్తు విస్తరణ పైన ఈ సందర్భంగా చర్చించారు. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ ఆయిన బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్ కార్ మంత్రి కేటీఆర్‌ని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలు ప్రాధాన్యత రంగాలని చైర్మన్‌కు కేటీఆర్ తెలియజేశారు.
 
ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు. రాక్‌వెల్ అటోమేషన్ సిఈవో ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, కెటిఆర్‌ను కలిసారు. 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షులు రాజీవ్ వెంకయ్య కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. 
 
హైదరాబాద్ ఇండియా యొక్క లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగ రాజధానిగా ఉన్నదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. 
మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కె గోయాంక, కెపిఎం జి గ్లోబల్ చైర్మన్ మరియు సిఈవో బిల్ థామస్, హెచ్‌సీ‌ల్ టెక్నాలజీస్ సిటివో కళ్యాణ్ కుమార్‌లు సైతం మంత్రితో సమావేశమయ్యారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments