మునిసిపల్ పోరులో కారుదే జోరు: కేటీఆర్

మంగళవారం, 21 జనవరి 2020 (10:31 IST)
తెలంగాణ రాష్ట్ర పురపాలక ఎన్నికల ప్రచారపర్వంలో తెరాస పార్టీ ప్రతిపక్షాలకు అందనంత ముందంజలో వున్నదని, ప్రజల నుంచి అత్యంత సానుకూల స్పందన టిఆర్‌ఎస్ పార్టీ‌కి వస్తుంది కేటీఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎంచుకున్న అభివృద్ధి జెండాకు ప్రజల పట్టం కడతారన్న ఆశాభావం వక్తం చేశారు. 
 
ప్రతిపక్షాల దూషణలు, అసత్య ప్రచారాలకు భిన్నంగా పట్టణాలకు ఏం చేస్తామో తమ పార్టీ వివరించిందన్నారు. ఘన విజయం దిశగా పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగిందని, ప్రచారం ముగిసినందున ఎన్నికల ప్రక్రియ, పార్టీ పరమైన ఏర్పాట్లపైన దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీచేశారు. 
 
పోలింగ్ కేంద్రాల్లో బూత్ ఏజెంట్ల గుర్తింపు వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. రానున్న 36 గంటలు స్థానిక టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హస్తినకు పయనమైన కన్నా ... రాజధాని తరలింపుపై అగ్రనేతలతో...