తెరాసకు ధీటుగా బీజేపీ : లక్ష్మణ్

ఆదివారం, 19 జనవరి 2020 (17:14 IST)
టీఆర్ఎస్ పార్టీకి దీటుగా ఎదుగుతున్న  బీజేపీని చూసి గులాబీ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కి గెలవాలని చూస్తుందని ఆరోపించారు. 
 
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కల్వకుంట్ల కుటుంబానికి పాలేరుగా మారతారు అని అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక గూటి పక్షులేనని ఆరోపించారు. భైంసాలో హిందువుల ఇల్లు ఖాళీ చేస్తున్నారు అంటే దానికి కారణం ఎంఐఎం పార్టీ నేనని భైంసాలో జరిగిన ఘటన నిజాంబాద్‌లో జరగకూడదనే బిజెపికి ఓటు వేయాలని టిఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అన్నారు.
 
కేంద్రం ఇచ్చిన నిధులు తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అరెస్టు అయితే చేశారు కానీ.. తరలించలేక తలప్రాణం తోకకు వచ్చింది..