Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటర్‌లో మిర్చి ఘాటుతో వెరైటీ చికెన్ గ్రేవీ..

ముందుగా ఎండుమిర్చిని నీళ్లలో వేసుకుని ఉడికించి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనెలో ఎండుమిర్చి పేస్

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (17:18 IST)
అసలే వింటర్. వేడి వేడి సూప్స్, స్నాక్ మీద మనస్సు మళ్లుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి వేడినిచ్చే చికెన్‌తో.. శరీరంలోని బ్యాక్టీరియాను నశింపజేసే మిర్చి కాంబోలో వెరైటీ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్ - అర కేజీ 
ఎండు మిర్చి - ఆరు 
ఆవనూనె - నాలుగు టేబుల్ స్పూన్లు 
దాల్చిన చెక్క- రెండు ముక్కలు 
ఏలకులు - ఐదు
శొంఠి పొడి- అర టీ స్పూన్ 
సోంపు పొడి- టేబుల్ స్పూన్ 
కారం- చెంచా
పసుపు- అర చెంచా 
ఉప్పు - తగినంత 
నూనె, నీరు - తగినంత 
 
తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చిని నీళ్లలో వేసుకుని ఉడికించి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనెలో ఎండుమిర్చి పేస్ట్, కారం వేసుకోవాలి. నిమిషం తర్వాత నీళ్లు పోసి.. అందులో చికెన్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి దోరగా వేపాలి. అన్నీ బాగా వేగాక.. చికెన్ ముక్కలు తగినంత నీరు పోసుకోవాలి. నీరు సగం అయ్యాక చికెన్ గ్రేవీలా అయ్యేంత వరకు ఉంచి దించేస్తే సరిపోతుంది. ఈ చికెన్ కూరను వేడి వేడి అన్నంలోకి లేదా రోటీల్లోకి తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments