సండే స్పెషల్.. చికెన్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాం..

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (21:03 IST)
ఆదివారం అనగానే నాన్ వెజ్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారి చికెన్ మంచూరియన్ అనే చైనా డిష్‌ను ట్రై చేయండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చాలా క్విక్‌గా లభించే ఈ చికెన్ మంచూరియన్‌ను అదే టేస్ట్‌తో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..!
 
కావలసిన పదార్థాలు: 
బోన్‌లెస్ చికెన్ : 1/4 కేజీ 
తరిగిన ఉల్లిపాయలు :  అరకప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి : అర టీ స్పూన్ 
కోడిగ్రుడ్డు : ఒకటి 
మైదాపిండి, సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగర్, కార్న్ ఫ్లోర్, టమోటా సాస్: ఒక్కో టీస్పూన్
ఉప్పు, నూనె: తగినంత
 
తయారీ విధానం: 
ముందుగా చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్‌లను తగినంత నీటితో కలిపి అరగంట పాటు ఊరనివ్వాలి. బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేపి ప్లేటులోకి తీసుకోవాలి. మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి. 
 
ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ నీరు చేర్చి కాసేపు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌లను చేర్చి నాలుగు నిమిషాల పాటు వేపాలి. ఇందులో తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేర్చి హాట్ హాట్‌గా ఫ్రైడ్రైస్, చపాతీ, రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేయాలి. టేస్ట్ అదిరిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

తర్వాతి కథనం
Show comments