గోంగూరతో రొయ్యలు కూరనా? ఎలా?

గోంగూరలో ఉండే పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలుచేస్తుంది. శరీరంలోని కొవ్వును కూడ నియంత్రిస్తుంది. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా శరీరంలోని రక్తపోటును

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (13:06 IST)
గోంగూరలో ఉండే పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలుచేస్తుంది. శరీరంలోని కొవ్వును కూడ నియంత్రిస్తుంది. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా శరీరంలోని రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి ఇది సహకరిస్తుంది.ఈ గోంగూరలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోంగూరలో అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా ఉంది. మరి దీంతో రొయ్యలు కూర ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
గోంగూర - 1 కప్పు
రొయ్యలు - 2 కప్పులు
వడియాలు - 1 కప్పు
నూనె - సరిపడా
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ ముద్ద - పావుకప్పు
ఉప్పు - తగినంత
కారం - ఒకటిన్నర స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4
జీలకర్ర - అరచెంచా
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో అరకప్పు నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక వడియాలు వేయించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని శుభ్రం చేసి వాటికి అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, ఉప్పు  వేసి బాగా కలుపుకోవాలి. వడియాలు వేయించిన బాణలిలోనే మరికొంచెం నూనె వేసి రొయ్యల్ని వేయించి తీసుకోవాలి. కాసేపు అలాలే ఉంచి అవి మెత్తగా అయిన తరువాత దించేయాలి.

మరో బాణలిలో రెండు చెంచాల నూనెను వేడిచేసి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయ ముద్ద వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయాక వేయించుకున్న రొయ్యలు, గోంగూరను వేసుకోవాలి. తరువాత అరకప్పు నీళ్లు, తగినంత ఉప్పు, మిగిలిన కారం వేసి మంట తగ్గించాలి. గోంగూర పూర్తిగా మగ్గి, ఇది కూరలా తయారయ్యాక ముందుగా వేయించుకున్న వడియాలు వేసి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. అంతే గోంగూర రొయ్యలు కూర రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అలా చేయడం హిందూ మతానికే మంచిది కాదు : సుప్రీంకోర్టు

సొంత ఇల్లు - భూమి లేదు : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. 50కిలో మీటర్లు సైకిల్ తొక్కుతూ..

మనుషుల ప్రాణాలకంటే కుక్కల ప్రాణాలే ముఖ్యమా? వీడియో చూడండి

సోషల్ మీడియా పోస్టులు.. పోలీసులు నిద్రపోతున్నారా? హైకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arya: ఆర్యా, పోలూరు కృష్ణ కాంబినేషన్ టైటిల్ రంజీ

Ravibabu: రవిబాబు, సురేష్ ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో రేజర్ సిద్ధమవుతోంది

Prabhas: ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం వేచి చూస్తున్నా : ధురంధర్ డైరెక్టర్ ఆదిత్యధార్

Nayanthara: నయనతార నో ప్రమోషన్ పాలసీని బ్రేక్ చేసిందా? ట్రోల్స్ మొదలు

Niharika: టికెట్ ధ‌ర‌ను రూ.100గా ఫిక్స్ చేసిన రాకాస‌ మేక‌ర్స్‌

తర్వాతి కథనం
Show comments