తవ్వా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం..

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (11:21 IST)
చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యానికి చాలా మంచివి. చేపల్లోని విటమిన్ డి నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది. వారానికే రెండుసార్లు చేపలలో ఆహారంలో భాగంగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. దాంతో మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇటువంటి చేపలతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
చేపలు - 500 గ్రాములు
కోడిగుడ్డు - 2 
మెుక్కజొన్న పిండి - 100 గ్రాములు
కారం - తగినంత
ధనియాల పొడి - 1 స్పూన్
జీలకర్ర పొడి - 1 స్పూన్
మిరియాల పొడి - 1 స్పూన్
ఓమా - 1 స్పూన్
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - 1 కట్ట
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్
చాట్ మసాలా - 1 స్పూన్
నిమ్మరసం - 3 స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా చేపలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఆ తరువాత పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో చేప ముక్కలు వేసి అందులో మెుక్కజొన్న పిండి, కారం, ధనియాలపొడి, జీలకర్ర, మిరియాల పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ఓమా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేపలపై కోటింగ్‌లా వేసి అరగంట పాటు అలానే ఉంచాలి. ఇప్పుడు తవ్వా మీద కొద్దిగా నూనేపోసి చేపముక్కలను వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర, చాట్ మసాలా చల్లాలి. అంతే టేస్టీ టేస్టీ తవ్వా ఫిష్ ఫ్రై రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసు : అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి : వైఎస్ సునీత

World Bank: అమరావతికి ప్రపంచ బ్యాంక్ 800 మిలియన్ డాలర్లు సాయం

బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు

విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా అమరావతి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్యూడ్ రూ.100 కోట్ల కలెక్షన్లు : హ్యాట్రిక్ కొట్టిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్

Rashmika: రశ్మిక మందన్న.. ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్, థియేట్రికల్ రిలీజ్ సిద్ధమవుతోంది

Raja Saab: రాజా సాబ్ నుంచి ప్రభాస్ బర్త్ డే అప్డేట్

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట

Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

తర్వాతి కథనం
Show comments