శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండడం వలన బరువు పెరుగుతారు. ఆ బరువును తగ్గించే గుణాలు మటన్ అధికంగా ఉన్నాయి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. మటన్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ఒబిసిటీని తగ్గిస్తుంది. ఇటువంటి మటన్‌తో జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
మటన్ - 250 గ్రాములు
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
టమోటాలు - 100 గ్రాములు
పచ్చిమిర్చి - 10 గ్రాములు
జీలకర్ర పొడి - 1 స్పూన్
ధనియాల పొడి - 1 స్పూన్
గరం మసాలా పొడి - 1 స్పూన్
నూనె - సరిపడా
ఉప్పు, కారం - తగినంత
కొత్తిమీర - 1 కట్ట
పసుపు - చిటికెడు.
తయారీ విధానం:
ముందుగా మటన్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు టమోటాలు, పచ్చిమిర్చి కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేయించి ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా మిశ్రమం వేసి ఇప్పుడు మటన్ వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికిక తరువాత జీలకర్రపొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. 10 నిమిషాల తరువాత కొత్తిమీర వేసి దించేయాలి. అంతే వేడివేడి మటన్ రోబన్ జ్యూస్ రెడీ.