Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్‌తో సమోసా ఎలా చేయాలో తెలుసా?

కావలసిన పదార్థాలు: చికెన్ - 400 గ్రాములు ఉల్లిపాయలు - 2 పచ్చిమిర్చి - 4 అల్లం తరుగు - 2 స్పూన్స్ పసుపు - 1/2 స్పూన్ కరివేపాకు - 2 రెబ్బలు కొత్తమీర తరుగు - కొద్దిగా ఉప్పు - తగినంత నూనె - సరిపడా మైదాపి

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (13:30 IST)
కావలసిన పదార్థాలు:
చికెన్ - 400 గ్రాములు 
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం తరుగు - 2 స్పూన్స్
పసుపు - 1/2 స్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తమీర తరుగు - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
మైదాపిండి - 2 కప్పులు
 
తయారీ విధానం: ముందుగా మైదాపిండిని ఓ గిన్నెలో వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, నూనెను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నీటిని పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకుని తరువాత అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. రెండు నిమిషాల తరువాత పసుపు, మిరియాలపొడి, చికెన్ మసాలా, సన్నగా కోసిన చికెన్ వేయాలి.

చికెన్ కాస్త మెత్తబడిన తరువాత ఆ మిశ్రమంలో తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకుని దింపేయాలి. ఇప్పుడు మైదాపిండిని ఉండల్లా చేసుకుని చపాతీలా ఒత్తి నిలువుగా కోయాలి. అందులో ఒక భాగాన్ని త్రికోణాకారంలో చుట్టి రెండు చెంచాల చికెన్ మసాలను అందులో వేసుకుని సమోసాలా చేసుకునే నూనెలో వేయించుకుంటే వేడివేడి చికెన్ సమోసా రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments