నవరాత్రి తొలి రోజు.. జీడిపప్పు హల్వాను నైవేద్యంగా పెడితే?

ముందుగా జీడిపప్పులను ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక లీటరు పాలు స్టౌమీద పెట్టి బాగా మరిగేటప్పుడు మనం ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న జీడిపప్పు ముద్దను వేసి బ

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (16:17 IST)
నవరాత్రుల్లో తొలిరోజు జీడిపప్పుతో హల్వాను నైవేద్యంగా సమర్పించుకోవాలి. నవరాత్రులు ప్రారంభమయ్యే తొలి రోజున శైలపుత్రీ దేవిని పూజించాలి. ఆ రోజున అమ్మవారికి జీడిపప్పు హల్వా, పూరీ, సజ్జతో అప్పాలు, చలిమిడి, వడపప్పు, పరమాన్నం, బియ్యం రవ్వతో చేసిన పాయసం సమర్పించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. వీటిలో జీడిపప్పుతో హల్వా ఎలా చేయాలంటే?
 
కావలసిన పదార్ధాలు: జీడిపప్పు-150 గ్రాములు, 
యాలకలు - 5, 
పాలు - ఒక లీటరు,
పంచదార - 200 గ్రా, 
మిఠాయి కలర్ - చిటికెడు.
 
తయారీ విధానం: ముందుగా జీడిపప్పులను ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక లీటరు పాలు స్టౌమీద పెట్టి బాగా మరిగేటప్పుడు మనం ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న జీడిపప్పు ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.
 
స్టౌమీద పాలలో ఉడికే జీడిపప్పుకు పంచదారను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా గట్టిపడేదాకా స్టౌమీద ఉడికించాలి. అలా గట్టిగా ముద్దగా తయారైన తర్వాత మిఠాయి కలర్‌ను, ఏలకుల పొడిని వేసి బాగా కలుపుకుని దించేసుకుంటే జీడిపప్పు హల్వా రెడీ. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేప్‌లో రోల్స్‌లా తయారు చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments