Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవరాత్రుల్లో ఏడవరోజు.. కాళరాత్రిని పూజిస్తే..(వీడియో)

నవరాత్రుల్లో ఏడవ రోజున (సెప్టెంబర్ 27) కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజి

Advertiesment
నవరాత్రుల్లో ఏడవరోజు.. కాళరాత్రిని పూజిస్తే..(వీడియో)
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (21:53 IST)
నవరాత్రుల్లో ఏడవ రోజున (సెప్టెంబర్ 27) కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజించడం ద్వారా భక్తులు ఆపదలు, అరిష్టాల నుంచి బయటపడతారు. 
 
ఈ రోజున సరస్వతీ దేవిని ఆవాహనం చేసుకోవాలి. మూల నక్షత్ర ఆవాహన ముహూర్తం నిడివి రెండు గంటల 22 నిమిషాలు. ముహూర్తం 3.45 నుంచి 06.07 గంటల వరకు. ఈ రోజు నుంచి సరస్వతీ పూజ ప్రారంభం అవుతుంది. 
 
ఈ రోజున కాళరాత్రిని ఈ క్రింది మంత్రముతో స్తుతిస్తే.. దారిద్ర్య ఈతిబాధలు తొలగిపోతాయి. కాళరాత్రి అమ్మవారి మంత్రము...
"ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా 
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరణీ 
వామ పాదోల్లిసల్లోహలితా కంటకా భూషణా 
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ"

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రుల్లో ఆరో రోజు కాత్యాయనీ దేవిగా అమ్మవారు... కన్యలు పూజిస్తే?(వీడియో)