మళ్లీ 40 ఏళ్ల తర్వాత 'సూపర్ స్నో మూన్'... ఎంత సక్కగున్నాడే...

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (21:40 IST)
నిండు పౌర్ణమి. పిండి వెన్నెల.. అది కూడా మాఘ మాసం. ఇంకా మంచు తెరలు తొలగి నులివెచ్చని పిల్లగాలులు. ఇలా చెప్పుకుంటూ పోతే వెన్నెల రాజు చందమామ అందాన్ని ఎంత చెప్పినా ఇంకా చెపుతూనే వుండాలనిపిస్తుంది. ఈ మానవకోటి అవతరించిన దగ్గర్నుంచి ఆ వెన్నెల మామ చందమామ గురించి చెప్పిన మాటలు, కవితలు, పాటలు... ఎన్నో ఎన్నెన్నో. 
 
ఇక అసలు విషయానికి వస్తే... ఫిబ్రవరి 19, అంటే రేపు పౌర్ణమి. అంతేగా... అనుకునేరు. ఇది అలాంటిది ఇలాంటిది కాదు, 40 ఏళ్ల తర్వాత వస్తున్న సూపర్ స్నో మూన్ నిండు పౌర్ణమి. తన వెన్నెల అందాన్నంతా ఎంతో దగ్గరగా మన వద్దకు తెస్తున్న చందమామ అందం చూసే అద్భుతమైన రోజు. 
 
రేపు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తున్నాడు. సుమారు 2 లక్షల 20 వేల మైళ్ల దూరంలో చందమామ కనువిందు చేయనున్నాడు. ఈ నిండు పౌర్ణమిని గతంలో 1979లో చూడటం జరిగింది. మళ్లీ ఈనాటికి మరోసారి చంద్రుడు కనువిందు చేయనున్నాడు. మరి ఆస్వాదించేందుకు సిద్ధమైపోదామా... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments