Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియుడికి పదేపదే ఫుడ్ ఆర్డర్.. యువతికి చురకలంటించిన జొమాటో

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (08:58 IST)
భోపాల్‌కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ ప్రియుడికి పదేపదే ఫుడ్ ఆర్డర్ చేసింది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా వరుసగా మూడుసార్లు ఫుడ్‌ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత క్యాన్సిల్ చేసింది. దీంతో జొమాటో యాజమాన్యానికి చిర్రెత్తుకొచ్చింది. దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయొద్దంటూ జొమాటో ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఆ యువతి షాక్‌కు గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భోపాల్‌కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ ప్రియుడి కోసం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆమె పెట్టిన ఫుడ్ ఆర్డరులో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షనన్‌ను ఎంచుకున్నారు. అయితే తీరా ఆ ఫుడ్ అక్కడకి వెళ్లాక సదరు మాజీ క్యాన్సిల్ చేశాడు. ఇలా మూడుసార్లు జరిగింది. దీంతో జొమాటో జోక్యం చేసుకుంది.
 
'భోపాల్‌కు చెందిన అంకిత దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ పంపించడం ఆపివేయండి. అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడం ఇది మూడోసారి' అని ట్వీట్ చేసింది. దయచేసి ఎవరైనా అంకిత ఖాతాలో క్యాష్ ఆన్ డెలివరీని బ్లాక్ చేసినట్లు చెప్పగలరని పేర్కొంది. ఆమె ఈ విషయం తెలియక ప్రయత్నిస్తోందని తెలిపింది. కాగా, ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. దీనికి లక్షలాది వ్యూస్ రాగా, వేలాది లైక్స్ వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments