ఏపీ సీఎంగా జగన్ 40 యేళ్లు ఉండాలి... భారతంలో దుర్యోధనుడు కాకూడదు.. : ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా సెటైర్ల రూపంలో వేశారు. జగన్ 40 యేళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నదే తన అభిలాష అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
నిజానికి సీఎం జగన్‌ను రఘురామరాజు ఎప్పుడు పొగుడుతారో.. ఎప్పుడు విమర్శిస్తారో ఎవరికీ తెలియదు. ఆయన చేసే వ్యాఖ్యలు కూడా నిందాస్తుతిని తలపిస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతంలో దుర్యోధనుడిలా సీఎం జగన్‌ అవ్వడం తనకు ఇష్టం లేదంటూనే, సీఎంగా 40 ఏళ్లు ఆయనే ఉండాలని అభిలషించారు. 
 
అంతలోనే ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల బ్యూరోక్రాట్స్‌కు కోర్టు మొట్టికాయలు వేసిందని, కోర్టుల చేత ఇన్ని అక్షింతలు వేయించుకున్న బ్యూరోక్రాట్స్ ఎవరూ లేరంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్ధుల విషయంలో అందరిదీ ఒక దారి అయితే ఏపీ సీఎంది ఇంకో దారి అని ఎద్దేవా చేశారు. సుప్రీం జోక్యంతో కరోనా వల్ల ఏపీ విద్యార్థులకు గండం తప్పిందని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments