Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ప్లే మ్యూజిక్ ఇక కనుమరుగు.. యూట్యూబ్ మ్యూజిక్‌తో కొత్త బటన్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (17:11 IST)
ప్రముఖ మ్యూజిక్ యాప్ గూగుల్ ప్లే మ్యూజిక్ ఇక కనుమరుగు కానుంది. దీన్ని శాశ్వతంగా మూసివేయాలని గూగుల్‌ నిర్ణయించింది. తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సెప్టెంబర్‌ నుంచి.. మిగిలిన దేశాల్లో అక్టోబర్‌ నుంచి ఈ యాప్‌ ఇక పనిచేయదు. డిసెంబర్‌ తర్వాత ఇందులో డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని గూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ప్రస్తుతం గూగుల్‌కు చెందిన గూగుల్‌ ప్లే మ్యూజిక్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ రెండూ ఒకేరకమైన సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే తరహా యాప్‌లు రెండు అవసరం లేదని భావించిన గూగుల్‌.. గూగుల్‌ ప్లే మ్యూజిక్‌కు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. 
 
ఇందులో భాగంగా గూగుల్‌ ప్లే మ్యూజిక్‌లో ఉన్న కంటెంట్‌ను యూట్యూబ్‌ మ్యూజిక్‌కు మార్చుకునేందుకు యూజర్లకు వీలు కల్పించింది. ఇందుకోసం యూట్యూబ్‌ మ్యూజిక్‌లో ఓ కొత్త బటన్‌ ఏర్పాటు చేసింది. యూజర్లు తమ డేటా కోల్పోకుండా ఉండేందుకు ఈ సదుపాయం కల్పించినట్లు గూగుల్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments