Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవాస్‌ యోజన కింద ఇల్లు ఇప్పిస్తామంటూ.. యువతిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (15:47 IST)
నిర్భయ లాంటి చట్టాలున్నప్పటికీ.. దేశంలో అత్యాచారాల పర్వం ఆగడం లేదు. కామాంధులు రోజుకోవిధంగా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇల్లు ఇప్పిస్తామంటూ.. ఇద్దరు యువకులు ఓ యువతి (22) పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. అక్కడినుంచి పరారయ్యారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని భోపా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 
 
యువతిపై యోగేశ్‌ కుమార్, బబ్లు అనే ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు భోపా పోలీసులు శనివారం తెలిపారు. అయితే.. ఈ అత్యాచార ఘటనను నిందితుల్లో ఒకరు ఫొన్లో రికార్డు చేశారని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ వీడియోతో యువతిని వేధించడం మొదలుపెట్టారు.
 
ఈ క్రమంలో గురువారం ఫోన్‌ నుంచి వీడియో తొలగిస్తానని చెప్పి.. పొలం దగ్గరికి యువతిని రప్పించిన యోగేశ్‌ కుమార్‌ మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తొలగించకపోగా.. మరలా బెదిరింపులకు పాల్పడటంతో చివరకు యువతి పోలీసులను ఆశ్రయించిందని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ రాజ్ కుమార్ తెలిపారు. 
 
యువతి ఫిర్యాదు మేరకు సెక్షన్ 376, 506 కింద ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపామని.. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు. వైద్య పరీక్షల రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు రాజ్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments