Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో మూడు నెలలకు మూడు ముళ్లు వేయకూడదట.. ఎందుకు?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (18:53 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఓ జిల్లాలో మూడు నెలలకు ఎవ్వరూ పెళ్లి మాట ఎత్తకూడదట. అవును. యూపీలోని అలహాబాద్ జిల్లాలో ఇక మూడు నెలలకు ఎవ్వరూ వివాహం చేసుకోకూడదని ఆ రాష్ట్ర సర్కారు షరతు విధించిందట. ఈ నిషేధంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


అంతేగాకుండా.. మరో మూడు నెలలకు ముందుగానే బుక్ చేసిన కళ్యాణ మండపాల ఈవెంట్లను రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చేసేది లేక ముహూర్తాలను మూడు నెలలకు తర్వాత వాయిదా వేసుకున్న వారు కూడా వున్నారట. 
 
అయితే ఇందుకు కారణం లేకపోలేదు. యూపీలోని అలహాబాద్‌లో వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మొత్తం మూడు నెలల పాటు కుంభమేళా జరుగనుంది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు భారీ ఎత్తున ప్రజలు యూపీకి తరలిరానున్నారు. కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానమాచరించే వారి సంఖ్య వచ్చే ఏడాది భారీగా వుంటుందని యోగి ఆదిత్యనాథ్ సర్కారు భావిస్తోంది. 
 
ముఖ్యంగా ముహూర్తపు రోజుల్లో ఈ రద్దీ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం వుంది. ఇందుకోసం కళ్యాణ మండపాలను భక్తులకు ఆశ్రయం కల్పించనున్నారు. ఆహారం, నివాసం కోసం కళ్యాణ మండపాల్లో ఏర్పాట్లు చేసేందుకు యోగి సర్కార్ సంసిద్ధమైంది. అలాంటి సమయంలో వివాహం జరిపితే.. కుంభమేళాలో పాల్గొనే భక్తులకు ఇక్కట్లు తప్పవని యూపీ సర్కార్ తెలిపింది.
 
అందుచేత జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు అలహాబాద్‌లో వివాహాలను జరపకూడదని యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు.. జిల్లా అధికారులు  కళ్యాణ మండపాలు, హోటల్‌ నిర్వాహకులకు నోటీసులు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments