ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు.. అధికారులంతా ఠంచనుగా 10 గంటలకే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిందేనంటూ ఆయన ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు.. అధికారులంతా ఠంచనుగా 10 గంటలకే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిందేనంటూ ఆయన ఆదేశించారు.
గ్రామీణాభివృద్ధిపై శనివారం రాత్రి అధికారులతో నిర్వహించిన సమావేశంలో యోగి.. కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి ఆఫీసులకు వచ్చేలా చేయడానికి బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని ఆదేశించారు. బ్లాక్‌లెవల్ వరకు అన్ని కార్యాలయాల్లో ఈ మెషిన్లను ఏర్పాటు చేయాలని స్పష్టంచేశారు.
బయోమెట్రిక్ మెషిన్లతోపాటు ప్రతి పంచాయతీలో ఓ బోర్డును ఏర్పాటు చేయాలని, ఆ గ్రామ అధికారుల నంబర్లు, జరుగుతున్న పనుల వివరాలు ఈ బోర్డు దగ్గర ఉండాలని యోగి తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అర్హులైన 5.73 లక్షల మంది సభ్యుల వివరాలు రిజిస్టర్ చేయడం, ఫొటోలు తీసుకోవడం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.