Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అత్యంత ప్రజాదారణ కలిగి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (12:41 IST)
సోషల్ సామాజికమాద్యం ట్విట్టర్‌లో దేశంలోనే అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. గతంలో దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల కంటే.. అత్యధిక ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్యను కలిగిన ఆయన... ఇపుడు దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా నిలించారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటింది. అంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్.. యూపీ సీఎం యోగి తర్వాత స్థానంలో ఉన్నారు. 
 
కేజీవాల్ వ్యక్తిగత ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. అలాగే, 24.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్న రాహుల్ గాంధీ కంటే కూడా యోగి ముందు ఉండటం గమనార్హం. ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు 19.1 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. యోగి వ్యక్తిగత అకౌంత్‌పాటు ఆయన వ్యక్తిగత ఆఫీస్ అకౌంట్‌ను కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో అనుసరిస్తున్నారు. కోటి మందికి పైగా ఆఫీస్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో సీఎం యోగి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనే పేరు గడించారు. 
 
చట్టాలను ఉల్లంఘించే వారిని ఆయన అస్సలు ఉపేక్షించరని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరహా పాలనకు యోగి మోడల్ అని కూడా నామకరణం చేశాయి. మరోవైపు, రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో చేసిన ఏర్పాట్లపై కూడా సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఇక ట్విట్టర్ ఫాలోవర్లపరంగా ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనను ఏకంగా 95.1 మిలియన్ మంది అనుసరిస్తున్నారు. 34.4 మిలియన్ ఫాలోవర్లతో హోం మంత్రి అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments