Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమదాం.. ఏడుగురు మృత్యువాత

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (07:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి మధుర యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై 68 మైలురాయి సమీపంలో బోల్తాపడివున్న ట్యాంకర్ లారీని ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. 
 
ఓ ట్యాంకర్‌ నోయిడా నుంచి ఆగ్రా వైపు వస్తోంది. ఈ క్రమంలో టైర్‌ పేలడంతో అదుపు తప్పి మరోమార్గంలో బోల్తాపడింది. అయితే, ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్న ఇన్నోవా అమితవేగంతో వచ్చి దాన్ని ఢీకొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. 
 
మృతులను హర్యానాలోని జింద్‌ వాసులని, మనోజ్ (45), అతని భార్య బబితా (40), కుమారులు అభయ్ (18), హేమంత్ (16), హిమాంగి (14), మను (10), డ్రైవర్ రాకేశ్ (39)గా గుర్తించారు. 
 
బోల్తాపడిన ట్యాంకర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇన్నోవా నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మృత్యువాతపడగా.. మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కట్టర్‌ను వినియోగించి మృతదేహాలను అందులో నుంచి బయటకు తీశారు. దీంతో ఆ ప్రాంతమైన రక్తసిక్తమైంది. ప్రమాదస్థలిని ఎస్పీ దేహాత్‌ శ్రీచంద్‌ సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments