Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (13:56 IST)
బెంగుళూరులో ఓ మహిళ కారు డ్రైవింగ్ చేస్తూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బెంగుళూరు పోలీసులు స్పందించి, ఆ మహిళను గుర్తించి వార్నింగ్ ఇచ్చి పంపించారు. 
 
ఓ మహిళ కారు డ్రైవింగ్ సీటులో కూర్చొని స్టీరింగ్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేస్తూ కనపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని సంబంధిత కంపెనీని డిమాండ్ చేశారు. ఆర్టీ నగర్ ప్రాంతంలో మహిళ చేసిన సర్కస్ ఫీట్‌ను మరో కారులో వెళుతున్న వారు వీడియో తీసి ట్రాఫిక్ పోలీసులకు షేర్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసుల సదరు కారు, కారు నడిపిన మహిళ గురించి ఆరా తీసి గుర్తించారు. 
 
మరుసటి రోజు పొద్దున్నే ఇంటికి వెళ్లి వర్క్ ప్రమ్ హోం అంటే ఇంట్లో కూర్చుని చేయాలి కానీ ఇలా కారు స్టీరింగ్ ముందు కూర్చొని కాదు అని మందలించారు. అలాగే, రూ.1000 అపరాధం విధించారు. పైగా, ఈ వీడియోను, చలానా అందిస్తున్న ఫోటోను ట్వీట్ చేస్తూ, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మీ ప్రాణాలకో కాదు ఇతరుల ప్రాణాలకూ ముప్పు అని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరిక  చేశారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments