Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు మద్దతుగా మహిళలు.. ట్రాక్టర్లతో 'ఛలో ఢిల్లీ' అంతా మహిళలే

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (10:42 IST)
వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా వంద రోజులకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా నేడు మహిళలు సంఘీభావం ప్రకటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ సరిహద్దులో రైతుల దీక్షకు మద్దతుగా నిరసన ప్రకటించేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఛలో ఢిల్లీ అంటున్నారు. సోమవారం జరిగే రైతు దీక్షలో అన్నింటా మహిళా రైతులే ముందుంటారు. 
 
ధర్నాలు, నిరసనలు, ప్రసంగాలు అన్ని మహిళా రైతులే చేస్తారు. సింఘు సరిహద్దులో మహిళా రైతులతో ర్యాలీ కూడా నిర్వహిస్తామంటున్నారు నేతలు. మరోవైపు మహిళలు పెద్ద ఎత్తున దీక్షా స్థలికి వస్తుండటంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహిళా పోలీసులకు పెద్ద సంఖ్యలో ఢిల్లీ సరిహద్దులకు తరలిస్తున్నారు.
 
ఇకపోతే.. హర్యానా, పంజాబ్‌ నుంచి వేలాది మహిళలకు స్వయంగా ట్రాక్టర్లు నడుపుకుంటూ ఢిల్లీకి పయనమయ్యారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతుల దీక్ష స్థలి వద్దే ప్రత్యేక వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది మహిళలకు రైతులకు మద్దతు తెలిపేందుకు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటారని రైతు సంఘాల నేతలు తెలిపారు.
 
సింఘు, ఘాజీపూర్‌, టిక్రీలలో కొనసాగుతున్న రైతు దీక్ష శిబిరాలకు వారంతా చేరుకుంటారన్నారు. నిరసనలో పాటు వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర అనే అంశంపై దీక్షా స్థలిలో సదస్సు నిర్వహిస్తామంటున్నారు రైతు సంఘాల నేతలు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments