Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెడ్డం గీసుకోలేదని భర్తపై వేడి నీళ్లను పోసేసిన భార్య.. ఎక్కడ?

గెడ్డం గీసుకునేందుకు భర్త నిరాకరించడంతో భర్త మరుగుతున్న నీళ్లు పోసిందో భార్య. భర్త గెడ్డం పెంచడం ఇష్టం లేని భార్య దానిని తీసివేయాలంటూ పలుసార్లు కోరింది. అయినా గడ్డం గీసుకోకపోవడంతో మరుగుతున్న నీళ్లు పో

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (10:35 IST)
గెడ్డం గీసుకునేందుకు భర్త నిరాకరించడంతో భర్త మరుగుతున్న నీళ్లు పోసిందో భార్య. భర్త గెడ్డం పెంచడం ఇష్టం లేని భార్య దానిని తీసివేయాలంటూ పలుసార్లు కోరింది. అయినా గడ్డం గీసుకోకపోవడంతో మరుగుతున్న నీళ్లు పోసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అలీగఢ్‌కు చెందిన సల్మాన్ ఖాన్ (32), నగ్మా భార్యభర్తలు. మత విశ్వాసం కారణంగా సల్మాన్ గెడ్డం పెంచుతూ వస్తున్నాడు. 
 
భర్త గెడ్డం పెంచడంపై శుక్రవారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేని నగ్మా భర్తపై మరుగుతున్న నీళ్లు పోసింది. ప్రస్తుతం సల్మాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరునెలల క్రితమే వివాహమైందని.. ఇప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.
 
భర్త ఆహార్యం విషయంలో నగ్మా చేసే సూచనలను ఏమాత్రం సల్మాన్ పట్టించుకోకుండా వ్యవహరించేవాడని పోలీసులు తెలిపారు. కాగా, భార్య నగ్మాపై సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగ్మాపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments