Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‍‌బుక్ ప్రేమ.. సరిహద్దు దాటిన యువతి.. కానీ కటకటాలకు..?

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (11:04 IST)
ఫేస్‍‌బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ కోసం ఆ యువతి సరిహద్దులు కూడా దాటింది. కానీ కటకటాల పాలైంది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్‌ (22) అనే యువతి ప్రియుడి కోసం సరిహద్దులు దాటింది. ఫేస్‌బుక్‌ ద్వారా కోల్‌కతాకు చెందిన అభిక్‌ మండల్‌తో ఆమె పరిచయం ప్రేమగా మారింది. 
 
అతని కోసం సరిహద్దుల్లో రాయల్‌ బెంగాల్‌ పులుల నివాసమైన దట్టమైన సుందర్బన్‌ అడవుల గుండా ప్రయాణించి, గంటపాటు నదిలో ఈది భారత్‌లోకి ప్రవేశించింది. కోల్‌కతాలోని కాళీఘాట్‌ ఆలయంలో మూడు రోజుల క్రితం అభిషేక్‌ను పెళ్లాడింది కూడా.
 
అయితే, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే నేరంపై పోలీసులు కృష్ణ మండల్‌ను సోమవారం అరెస్టు చేశారు. ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌ హై కమిషనర్‌కు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. 
 
కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలుడు ఇలాగే తనకిష్టమైన చాక్లెట్‌ కోసం సరిహద్దుల్లో నదిని ఈది భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ బాలుడిని కూడా అధికారులు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments