Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో హైపర్‌టెన్షన్‌ అవగాహన మాస వేడుకలను ముగించిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌

Advertiesment
Hypertension Awareness
, మంగళవారం, 31 మే 2022 (19:34 IST)
ఇన్నోవేషన్‌ ఆధారిత, అంతర్జాతీయ  ఫార్మాస్యూటికల్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (గ్లెన్‌మార్క్‌) మే నెలను హైపర్‌టెన్షన్‌ అవగాహన మాసంగా నిర్వహించింది. గ్లెన్‌మార్క్‌ ఇప్పుడు 18వేల మందికి పైగా ఆరోగ్య నిపుణులు, 8వేలకు పైగా హాస్పిటల్స్‌ మరియు క్లీనిక్స్‌తో దేశవ్యాప్తంగా 50 నగరాలలో భాగస్వామ్యం చేసుకుంది. తద్వారా 110కు పైగా ప్రజా అవగాహన ర్యాలీలను, 8వేల స్ర్కీనింగ్‌  క్యాంప్‌లను నిర్వహించింది.

 
ఈ ర్యాలీలలో భాగంగా హైపర్‌టెన్షన్‌ లక్షణాలు, నివారణ పద్ధతులు పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా సామాన్య ప్రజలకు స్ర్కీనింగ్‌ క్యాంప్‌లను సైతం నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ కంపెనీ ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు 2 లక్షల మంది ప్రజలలో అవగాహన కల్పించింది.

 
ఈ కార్యక్రమం గురించి గ్లెన్‌మార్క్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ ఇండియా ఫార్ములేషన్స్‌ అలోక్‌మాలిక్‌ మాట్లాడుతూ, ‘‘ఈ నెల రోజుల కార్యక్రమాలలో దేశంలో నిశ్శబ్ద హంతకిగా మారిన రక్తపోటు వ్యాధి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. హైపర్‌టెన్షన్‌ ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇటీవల భారతదేశంలో నిర్వహించిన అధ్యయనంలో ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు హైపర్‌ టెన్షన్‌‌తో బాధపడుతున్నారు. హైపర్‌టెన్షన్‌ నిర్వహణలో అగ్రగామిగా, దేశంలో ఈ మహమ్మారితో పోరాడేందుకు అనువుగా విభిన్న చర్యలను తీసుకోనున్నాం’’ అని అన్నారు.

 
హైపర్‌టెన్షన్‌ విభాగంలో అగ్రగామిగా, విప్లవాత్మక యాంటీ హైపర్‌టెన్షన్‌ డ్రగ్స్‌, టెల్మాను విడుదల చేసింది. ఇటీవలనే ఈ సంస్థ టేక్‌ చార్జ్‌ ఎట్‌ 18 ప్రచారం ప్రారంభించింది. దీనిద్వారా 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు హైపర్‌టెన్షన్‌ పట్ల అవగాహన కల్పిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డయాబెటిక్ వ్యాధి వున్నవారు మామిడిని తినవచ్చా?