Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాంతి చేసుకునేందుకు తలబయటపెట్టిన యువతి... బస్సుల మధ్య తల నలిగి...

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (11:21 IST)
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతి దుర్మరం పాలైంది. రెండు బస్సుల మధ్య తల ఇరుక్కుని నలిగిపోవడంతో ఆమె మృత్యువాతపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ ప్రాంతానికి చెందిన బాబ్లీ అనే 20 యేళ్ళ యువతి తన సోదరి, ఆమె భర్త, వారి ముగ్గురు పిల్లలతో కలిసి లుథియానా వెళ్లేందుకు కాశ్మీర్ గేటు వద్ద హర్యానా రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఎక్కారు. 
 
ఈ బస్సుఅలీపూర్ ప్రాంతానికి చేరుకోగానే, ఆ యువతికి వాంతి రావడంతో కిటికీలోంచి తల బయటపెట్టింది. అదేసమయంలో మరో బస్సు ఓవర్ టేక్ చేస్తుండటంతో రెండు బస్సుల మధ్య ఆమె తల నలిగి దుర్మరణం చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండో బస్సు కోసం గాలిస్తున్నారు. 
 
మాదాపూర్‌లో రేవ్ పార్టీలో చిక్కిన సినీ నిర్మాత
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మాదాపూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ రేవ్ పార్టీని పోలీసులు గుర్తించారు. ఇక్కడ రేప్ పార్టీ జరుగుతుందన్న పక్క సమాచారం మాదాపూర్ నార్కోటిక్స్ విభాగం ఆకస్మిక తనిఖీలు చేసింది. ఇందులో పలువురు సినీ ప్రముఖులతో పాటు ధనవంతుల పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఓ సినీ నిర్మాతతో పాటు ఇండస్ట్రీకి చెందిన యువతులు ఉన్నట్టు వార్తలు వస్తున్నారు. ఈ రేప్ పార్టీలో పాల్గొన్న వారి వద్ద నార్కోటిక్సి విభాగం పోలీసులు భారీ మొత్తంలో మత్తపదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుల్లో సినీ నిర్మాత ఒకరు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments