Webdunia - Bharat's app for daily news and videos

Install App

కజిన్‌తో వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా ఫలితం లేదు.. చివరికి?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (18:19 IST)
మానవీయ విలువలు మంటగలిసి పోతున్నాయి. భార్యాభర్తల సంబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం ఒక మహిళ నిండు ప్రాణాన్నిబలిగొంది. 
 
తన కజిన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను వద్దని మందలించాడు భర్త. అయినా భార్య లెక్క చేయకుండా ఆ బంధాన్ని కొనసాగించసాగింది. సహనం కోల్పోయిన భర్త, భార్యను గొంతు నులిమి హత్య చేసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు కార్పోరేషన్ పరిధిలోని తోండముత్తూరులో నివసించే లక్ష్మణ్ రాజ్ (36) శరణ్య(26)లకు ఆరేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్లుగా శరణ్య లక్ష్మణ్ రాజ్ కజిన్ యువ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
 
ఇటీవల లక్ష్మణ్ రాజ్ ఈవిషయాన్ని పసిగట్టాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోమని భార్యకు నచ్చ చెప్పాడు. అయినా శరణ్యలో మార్పు రాలేదు. దీంతో దంపతులు మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి.
 
ఏప్రిల్ 23 శుక్రవారం తెల్లవారు ఝూమున నిద్రపోతున్న శరణ్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments