Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదిహేనేళ్ల సంసారం గోవిందా.. మరో వ్యక్తితో సహజీవనం.. చివరికి..?

Advertiesment
పదిహేనేళ్ల సంసారం గోవిందా.. మరో వ్యక్తితో సహజీవనం.. చివరికి..?
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:45 IST)
పదిహేనేళ్ల సంసారం.. ఆపై విబేధాలతో ఆ జంట విడిపోయింది. దీంతో తన ఇద్దరు పిల్లలతో సహా భార్య పుట్టింటికి వచ్చేసింది. పదేళ్ల నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ విడిగానే ఉంటున్నారు. అయితే ఒంటరిగా పుట్టింట్లో ఉంటున్న ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
నాలుగేళ్లుగా అతడు ఆమె ఇంట్లోనే మకాం వేశాడు. కానీ ఉన్నట్టుండి ఊహించని రీతిలో అర్ధరాత్రి అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎండాకాలం కదా అని రాత్రిపూట నిద్రపోయేందుకు బయటే మంచంపై పడుకున్నాడు. అతడిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయిని అతడిపై వేశారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే అతడు మరణించాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం దిగువలభంవారిపల్లెకు ఆదిలక్ష్మి అనే మహిళకు పుంగనూరు మండలం అరడిగుంటకు చెందిన అర్జున్‌తో 15 ఏళ్ల క్రితమే పెళ్లయింది. పెళ్లయిన అయిదేళ్లు మాత్రమే వారి కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. అయిదేళ్ల తర్వాత విబేధాలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. ఆదిలక్ష్మి తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఈ క్రమంలోనే కర్ణాటకలోని శ్రీనివాసపురం తాలూకా ఒలికిరి గ్రామానికి చెందిన మేస్త్రీ శ్రీనివాసులుతో ఆదిలక్ష్మికి పరిచయం ఏర్పడింది. కూలి పనులకు వెళ్లిన సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిని పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి దీసింది. దీంతో నాలుగేళ్లుగా ఆదిలక్ష్మి ఇంట్లోనే అతడు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.
 
ఎండాకాలం కావడంతో శ్రీనివాసులు రోజూ రాత్రిళ్లు ఇంటి బయటే నిద్రించేవాడు. గురువారం రాత్రి కూడా అదే విధంగా ఇంటి బయట నిద్రపోయాడు. అయితే  అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెద్ద బండరాయిని అతడిపై వేసి అక్కడినుంచి పరారయ్యాడు. గట్టిగా అతడు కేకలు వేయడంతో ఆదిలక్ష్మి బయటకు వచ్చి చూసింది. తీవ్రరక్తపు మడుగులో ఉన్న అతడిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. 
 
పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మరణించాడు. ఈ ఘాతుకానికి పాల్పడిందెవరన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెడ్ కావాలంటే రూ. 1,00,000 కట్టాల్సిందే, రోగుల బాధలు కరెన్సీ నోట్లుగా...