Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-చైనా సరిహద్దుల్లో మహిళ హల్ చల్.. శివుడ్ని పెళ్లాడబోతున్నా

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (12:45 IST)
భారత్-చైనా సరిహద్దుల్లో ఓ మహిళ హల్ చల్ చేస్తోంది. లక్నోకు చెందిన ఆమె పేరు హర్మీందర్ కౌర్. తాను పార్వతీదేవినని, కైలాస పర్వతంపై కొలువున్న శివుడ్ని పెళ్లాడబోతున్నానని చెప్తోంది. వివరాల్లోకి వెళితే... నభిదాంగ్ ప్రాంతంలో నిషిద్ధ ప్రదేశంలో హర్మీందర్ కౌర్ ఉంటున్న విషయాన్ని గుర్తించిన పితోరాగఢ్ పోలీసులు ఆమెను అక్కడ్నించి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, తనను బలవంతంగా తీసుకెళితే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దాంతో వెనుదిరిగిన పోలీసులు, ఈసారి మరింత పెద్ద బృందంతో వెళ్లాలని నిర్ణయించారు. 
 
హిమాలయాల్లోని గుంజీ ప్రాంతానికి 15 రోజుల క్రితం తన తల్లితో కలిసి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అందుకు ఆమెకు అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే, ఆమె నిషిద్ధ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో పాటు, అనుమతించిన మేర గత నెల 25తో కాలపరిమితి పూర్తయిందని వివరించారు. దాంతో ఆమెను ఖాళీ చేయిస్తున్నామని వివరించారు. 
 
ఇద్దరు ఎస్సైలు, ఓ ఇన్ స్పెక్టర్ తో ఒక పోలీసు బృందాన్ని పంపిస్తే ఆమె తిరిగొచ్చేందుకు ససేమిరా అంటోందని, ఈసారి 12 మందితో పెద్ద బృందాన్ని పంపిస్తామని, ఆమెను నిషేధిత ప్రాంతం నుంచి వెలుపలికి తీసుకువస్తామని ఎస్పీ లోకేంద్ర సింగ్ వెల్లడించారు. తానే పార్వతీదేవినంటూ చెప్పుకోవడం చూస్తుంటే ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న విషయం అర్థమవుతోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments