Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్మర్‌లో దారుణం: భర్తను బెల్టుతో గొంతు బిగించి హత్య.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (15:57 IST)
బార్మర్‌లో దారుణ చోటుచేసుకుంది. భర్తకు జీతం తక్కువని ఆయన్ని హత్య చేసింది భార్య. తక్కువ జీతం సంపాదిస్తున్నాడని భర్తను బెల్టుతో గొంతు బిగించి హత్య చేసింది. 
 
వివరాల్లోకి వెళితే... మంజూ-అనిల్‌కుమార్‌ భార్యాభర్తలు. అనిల్ కుమార్ చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భర్తకు జీతం తక్కువ అని,తన కోరికలు తీర్చేందుకు తగినంత డబ్బు సంపాదించడంలేదని భార్య మంజూ భావిస్తుండేది.
 
ఇదే కారణంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం దంపతులు మద్యం సేవించారు. ఈ సమయంలోనే డబ్బుల విషయంలో మంగళవారం అర్థరాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన భార్య భర్తను హత్య చేసింది. 
  
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు మంజును పోలీసులు విచారించారు. విచారణలో మంజు హత్య చేసినట్లు ఒప్పుకుంది. నేరం ఒప్పుకోవడంతో నిందితురాలు భార్య మంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు మొత్తం హత్యాకాండపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments