Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంతో హనీట్రాప్ : సన్నిహితంగా ఉంటూ భారీ దోపిడి

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (11:51 IST)
ఓ యువతి తన అందాన్ని ఫణంగా పెట్టి హనీట్రాప్‌కు తెరతీశారు. తన అందంతో పలువురుని ముగ్గులోకి దించి వారి నుంచి భారీ దోపిడీకి పాల్పడసాగింది. ముఖ్యంగా, తన అందాన్ని ఎరగా వేసి అనేక మంది ప్రముఖులను తన వలలో వేసుకునేది. ఆ తర్వాత వారితో సన్నిహితంగా, ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసేది. ఈ ఘటన భువనేశ్వర్‌లో వెలుగు చూసింది. అలాగే, కిలాడీ లేడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు ఈ మహిళకు సంబంధించిన అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఆమె నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను విశ్లేషణల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కాగా, పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఆమెకు భువనేశ్వర్‌లో విశాలమైన భవనం ఉన్నట్టు గుర్తించారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో సంపన్నులు, ఉన్నతాధికారులతో స్నేహం చేస్తున్నట్టుగా నటిస్తూ వారితో ఫోటోలు, వీడియోలు తీసుకునేంది. 
 
అలా వారిని ముగ్గులోకి దించేది. ఆ తర్వాత తాను అడిగినంత ఇవ్వకపోతే వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేది. ఈ మాయలేడి వలలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా చిక్కుకున్నారు. ఈమెకు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లతో పాటు ఓ ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments