Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్ కేంద్రంలోనూ వేధింపులా..? వీడియో తీసి పోస్ట్ చేసిన..?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (12:31 IST)
మహిళలపై కామాంధుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. తాజాగా కరోనాతో క్వారంటైన్‌కు వెళ్లిన మహిళలపై కూడా వేధింపులు జరుగుతున్నాయి. 
 
తాజాగా క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న వలస కార్మికురాలిపై స్థానిక సర్పంచి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సువర్ణపూర్‌ జిల్లా డుంగురిపల్లి సమితి అందారిబంచిలో ఆదివారం చోటుచేసుకుంది. సంబంధిత బాధిత యువతి సర్పంచిపై ఆరోపణలు చేస్తూ తనకు న్యాయం చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. జూన్‌ 1వ తేదీన తమిళనాడు నుంచి కొంతమంది వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. సువర్ణపూర్‌ జిల్లాకు చెందిన ఆయాప్రాంతాల క్వారంటైన్‌ కేంద్రాలకు పంపారు. ఇందులో అందారిబంచి క్వారంటైన్‌లో ఉన్న ఓ యువతికి ప్రత్యేక గది కేటాయించారు. 
 
స్థానిక సర్పంచి బనమాలిషా రోజూ రాత్రిపూట మద్యం తాగి కేంద్రానికి వచ్చి తనను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత యువతి ఆరోపించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments