Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసులోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది.. ఎందుకంటే..?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (14:28 IST)
మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇలా పెళ్లై పిల్లలున్న ఓ వ్యక్తి.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని.. ఇందుకు అంగీకరించండంటూ ఇంటికొచ్చి మరీ అడిగాడు. ఇందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో.. సదరు మహిళను వేధించడం మొదలెట్టాడు. అంతే మనస్తాపానికి గురైన 22 ఏళ్ల  యువతి ఆఫీసులోనే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుంది.
 
అయితే విషయం గుర్తించిన సాటి సిబ్బంది వెంటనే యువతిని రక్షించి ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. దోమ్మలూరులోని బీడీఏ లేఔట్‌లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రైవేటు కార్యాలయం నిర్వహిస్తున్నాడు. బీడీఏ లేఔట్ సమీపంలోనే కిరణ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. కిరణ్ కుమార్‌కు వివాహం అయ్యి భార్య, ఒక పాప ఉంది. అయితే కార్యాలయంలో పని చేస్తున్న యువతి మీద కిరణ్ కుమార్ కన్ను వేశాడు. ఆమెను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. 
 
అంతేకాకుండా యువతిని కిరణ్ కుమార్ లైంగిక వేదింపులకు గురి చెయ్యడంతో యువతి జీవితం మీద విరక్తి పెంచుకుంది. ఇంకా ఇంటికొచ్చి పిల్లనిమ్మని తల్లిదండ్రులను అడిగాడు. వారు కాదనేసరికి ఆఫీసులో వేధింపులకు గురిచేశాడు. దీంతో సదరు యువతి మనస్తాపంతో ఆఫీసులో ఉరేసుకుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం