Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ తగాదాలు.. అన్నయ్యను కొడ్డలితో నరికేసిన చెల్లెమ్మ

ఒరిస్సాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో తోడబుట్టిన సోదరుడిని ఓ చెల్లాయి దూరం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హనగుడలోని పరజ వీధికి చెందిన అన్నాచెల్లెళ్లు రత్నాకర్‌, రొయిలల వివాదం జరిగింది. ఈ వివా

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (12:03 IST)
ఒరిస్సాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో తోడబుట్టిన సోదరుడిని ఓ చెల్లాయి దూరం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హనగుడలోని పరజ వీధికి చెందిన అన్నాచెల్లెళ్లు రత్నాకర్‌, రొయిలల వివాదం జరిగింది. ఈ వివాదం దాడికి దారితీసింది. ఇద్దరూ దూషించుకుంటూ.. దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన రొయిల గొడ్డలి తీసుకుని అన్న రత్నాకర్‌(30) పై దాడి చేసింది. ఆ దాడిలో రత్నాకర్‌ తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది.
 
దీంతో వెంటనే రత్నాకర్‌ను బంధువులు జయపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపారు. అయితే మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు రొయిలను అరెస్టు చేసి కోర్టు హాజరు పరిచారు. కుటుంబ తగాదాలే సోదరుడిపై దాడి చేసేందుకు కారణమైందని.. విచారణలో తేలింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments