Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో నీలిచిత్రాలతో సంబంధం లేదన్న కిలారి: కానిస్టేబుల్ ఫోన్ నెంబర్‌ను అక్కడ పెట్టేశాడు..?

గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి చెందిన కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూపులో నీలిచిత్రాలు దర్శనమివ్వడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కార్

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (11:41 IST)
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి చెందిన కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూపులో నీలిచిత్రాలు దర్శనమివ్వడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ కిలారి మనోహర్.. నీలిచిత్రాలు పోస్ట్ కావడంపై స్పందించారు.

తన ప్రమేయం లేకుండా వాట్సాప్ గ్రూపులో విజువల్స్ అప్ లోడ్ అయ్యాయని చెప్పారు. దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. జూలై 31న విజువల్ అప్ లోడ్ అయితే దానికి కావాలని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, దీనిపై మహిళా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. హైదరాబాదులో షీటీమ్స్ మహిళా కానిస్టేబుల్‌కే వేధింపులు తప్పలేదు. మహిళలకు అసభ్యకర సందేశాలు పంపించి బెదిరించే వారిపై చర్యలు తీసుకుంటున్న వారికి రక్షణ కరువైంది.

షీటీమ్స్‌ మహిళా కానిస్టేబుల్‌ ఫోన్‌ చేస్తే నిఖిల్‌ కుమార్‌ అనే ఆకతాయి పరుష పదజాలంతో మాట్లాడాడు. ఆమెకు అసభ్యకర సందేశాలు పంపాడు. స్పందించకపోవడంతో ఆ కానిస్టేబుల్‌ ఫోన్‌ నెంబర్‌ను పోర్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి వికృతానందం పొందాడు.
 
కానీ చివరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇబ్రహీంపట్టణంలో చోటుచేసుకుంది. ఓ డిగ్రీ విద్యార్థిని అసభ్యకర మెసేజ్ పంపిన కేసు విచారణలో భాగంగా షీటీమ్‌ మహిళా కానిస్టేబుల్‌ స్నేహితకు అసభ్యకర సందేశాలు పంపిన నిఖిల్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు. వివరాలు అడుగుతున్న సమయంలో పరుష పదజాలంతో మాట్లాడాడు. ఆపై వేధింపులు మొదలెట్టాడు. దీంతో అతడిని షీ టీమ్స్ అరెస్ట్ చేసి.. జైలుకు పంపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం