భార్యాభర్తల గొడవ.. అక్రమ సంబంధం.. భర్తను తొడపై కాల్చేసింది..

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (18:57 IST)
అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య కార్చిచ్చులు రేపుతున్నాయి. ఇటీవల భార్యాభర్తలు కలిసి ఉండటం కల్లగా మారింది. విడాకులు తీసుకోవడం నుండి హత్యలు చేయడం వరకూ దారితీస్తున్నాయి. అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావని నిలదీసినందుకు భర్తను కాల్చేసింది ఓ మహిళ. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
సునీత మింజ్ (39) అనే మహిళ భతాపారా రైల్వే స్టేషన్‌లో ఆర్‌పిఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. అతని భర్త దీపక్ శ్రీవాస్తవ (42) కూడా రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావని నిలదీశాడు. ఈ విషయంలో వారి ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. అది ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. కోపావేశంతో భార్య తన సర్వీస్ రివాల్వర్ తీసి దీపక్‌ని కాల్చింది. గాలిలో రెండు సార్లు కాల్పులు జరిపి ఆ తర్వాత అతని తొడపై కాల్చింది. ఇప్పుడు అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు హత్యాయత్నం క్రింద ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments