Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిరాత్రికి తర్వాత కన్యత్వ పరీక్షల్లో విఫలం.. ఆ వధువును పుట్టింటికి పంపేశారు..!

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:52 IST)
కన్యత్వ పరీక్షల్లో విఫలమైన నవ వధువులిద్దరిని ఆ గ్రామ పెద్దలు పుట్టింటికి పంపారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే గ్రామానికి చెందిన అన్నాతమ్ముళ్లతో నవంబర్‌ 27న పెళ్లి జరిపించారు. అయితే తొలిరాత్రికి తర్వాత ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కన్యత్వ పరీక్షను నిర్వహించారు. 
 
ఇందులో ఒకరు మాత్రమే ఉత్తీర్ణులు కాగా, మరొక వధువుకి ఎలాంటి రక్తస్రావం కాలేదు. దీంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పుట్టింటికి పంపించేశారు. ఈ పెళ్లిని తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, రూ. 10 లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు.
 
ఈ అంశంపై అమ్మాయి తల్లిదండ్రులు జాత్ పంచాయతీ వారిని సంప్రదించగా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. కులంలోని కట్టబాట్ల ప్రకారం వర్జినిటీ పరీక్షలో యువతి విఫలమయిందని, దీంతో ఆమెకు ఇదివరకే ఎవరితోనో సంబంధం ఉందని పంచాయతీ పెద్దలు ఆరోపించారు. 
 
అంతేకాకుండా ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామని తీర్పుచెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments