Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోయే ముందు మొబైల్ పక్కనే పెట్టుకుంది.. అంతే మహిళ మృతి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (16:13 IST)
Redmi 6A
ఓ మొబైల్ ఫోను ఓ మహిళ ప్రాణాలు బలి తీసుకుంది. నిద్రపోయే ముందు.. మొబైల్ పక్కనే పెట్టుకుంది. అలా చేయడం ద్వారా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ రాత్రిపూట ఫోన్ వాడిన ఆమె.. దాన్ని తల దగ్గర దిండు పక్కనే పెట్టుకొని పడుకుంది.
 
అర్ధరాత్రి సమయంలో ఆ మొబైల్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్రమైన గాయమై విపరీతంగా రక్తం పోయిన ఆమె దుర్మరణం పాలైంది. దీని గురించిన వివరాలను ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.
 
'నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్‌మీ 6ఏ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. కాసేపటికి అది పేలిపోవడంతో ఆమె చనిపోయింది. ఇది మాకు చాలా విషాదమైన సమయం. మాకు సాయం చేయాల్సిన బాధ్యత బ్రాండ్‌పై ఉంటుంది' అని అతను ట్వీట్ చేశాడు. 
 
ఇది చూసిన నెటిజన్లు రెడ్‌మీపై మండిపడుతున్నారు. సదరు కుటుంబానికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తాము కూడా విచారణ జరుపుతున్నామని రెడ్‌మీ కంపెనీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments