Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్లక్ష్యం.. చిన్న తప్పు.. ఆ మహిళ ప్రాణాలను బలిగొంది.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (10:33 IST)
reverse gear
చిన్న చిన్న తప్పిదాలే పెద్ద నష్టాలను మిగుల్చుతాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని సదాశివనగర్‌లో ఇలాంటి ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో టెక్కి అయిన నందిని రావు (45) అనే మహిళ మృతి చెందింది. రివర్స్‌ గేర్‌లో చెట్టు కింద నిలిపిన కారు వెనకకి రావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 
 
చెట్టు, కారు డోర్‌ మధ్య ఇరుక్కుని సదరు మహిళ మరణించింది. నందిని కొడుకును ఆడిస్తూ బయటకు వచ్చింది. ఆ సమయంలో రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసి ఉన్న కారు డోర్ తీసింది. రివర్స్‌ గేర్‌లో నిలిపిన విషయం మరిచిపోయి అందులో ఎక్కబోయింది. దాంతో అనుకోకుండా కారు వెనక్కి కదిలింది. 
 
అయితే ఆ సమీపంలోనే చెట్టు ఉంది. దీంతో కారు తలుపుకు చెట్టుకి మధ్య నందిని ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సహాయం కోసం కేకలు వేసింది. స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించింది. 
 
కారు పార్కింగ్‌కు అడ్డుగా ఉన్న ఆ చెట్టును తొలగించాలని ఆమె పలుసార్లు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఆ ఏరియా ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.
 
సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments