Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై ఇద్దరితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన మాజీ భర్త

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (11:15 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై మరో ఇద్దరితో కలిసి మాజీ భర్త ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, అతి దారుణంగా హింసించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని జంతర జిల్లాలోని నారాయణ పూరా పోలీస్‌ స్టేషన్‌లో పరిధికి చెందిన స్థానిక మహిళ సమీపంలో కాళీపూజా థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లింది. దీన్ని గమనించిన ఆమె మాజీ భర్త పథకం పన్నాడు. సినిమా నుంచి తిరిగి వస్తున్న సమయంలో మరో ఇద్దరితో కలిసి ఆమెను కిడ్నాప్ చేశాడు. అక్కడ నుంచి ఊరిచివర ఉన్న పొలాల్లోకి తీసుకునిపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ దుర్మార్గులు అంతటితో ఆగలేదు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోవడంతో వారంతా పారిపోయారు. మరునాడు ఉదయం నిస్సహాయ స్థితిలో రోదిస్తున్న ఆమెను గమనించిన స్తానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ బాధితురాలి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం జంతర సదర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. దీనిపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ భర్తతో పాటు మరో ఇద్దరు కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments