Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. రెండేళ్ల పాటు అత్యాచారం.. కావాలంటే డీఎన్ఏ టెస్టు?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (17:29 IST)
ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ద్వారాహత్ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి తనపై రెండేళ్లుగా అత్యాచారం జరిపాడని, ఆయన వల్ల తనకు ఆడపిల్ల కూడా పుట్టిందని బాంబు పేల్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపుతోంది. ఐతే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఫ్యామిలీ తిప్పికొట్టింది. 
 
సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తోందని..రూ.5 కోట్లు ఇస్తే ఓకే అని, లేదంటే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరిస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డెహ్రడూన్‌లోని నెహ్రూ కాలనీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
అయితే సదరు మహిళ సాయంత్రం ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది, దీనిలో ఎమ్మెల్యే భార్య రీటా నేగి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు ఆరోపించింది. గత రెండేళ్లుగా ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఎమ్మెల్యేతో కూతురు ఉందని... తన వాదనలను నిరూపించుకోవడానికి ఆమె తన కుమార్తె, ఎమ్మెల్యేకు డీఎన్ఎ పరీక్ష చేయమని డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం