Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం కుచ్చుటోపీ.. నచ్చావని పెళ్లికి ఒప్పుకుంటుంది... చివరికి జంప్.. ఎలా?

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (14:30 IST)
డబ్బు కోసం ఆ వధువు ఐదుగురికి కుచ్చు టోపీ పెట్టింది. మనస్సుకు నచ్చావని చెప్తూ.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికింది. ఆ తర్వాత వారి దగ్గర డబ్బు గుంజేసి ఎస్కేప్ అయ్యేది. చివరికి విషయాన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఊహించని విషయాలు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన వరుడు, భోపాల్ జిల్లాకు చెందిన ఓ వధువుతో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ముహూర్తం రోజున కుటంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే, అప్పుడే అతనికి పెద్ద ట్విస్ట్ ఎదురైంది. వివాహ వేదికకు తాళం వేసి ఉంది. అది చూసి షాక్ అయిన వరుడు.. వధువుకు ఫోన్ చేశాడు. స్విచాఫ్ వచ్చింది. దీంతో అతను వధువు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ వచ్చాయి. దీంతో అతనికి అనుమానం వచ్చింది. జరిగిన మోసాన్ని గ్రహించిన వరుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
తాను మోసపోయిన విధానాన్ని పోలీసులకు వివరించాడు. ఇప్పుడు షాక్ అవడం పోలీసుల వంతైంది. ఎందుకంటే.. ఈ వరుడి మాదిరిగా మరికొంతమంది యువకులు కూడా పెళ్లి పేరుతో తమను వంచించారంటూ ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయే తమని కూడా మోసం చేసిందని ఫిర్యాదు చేశారు.
 
దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెల్లడించారు. పెళ్లి పేరుతో ఈ ముఠా వరుడి కుటుంబ నుంచి భారీగా డబ్బులు తీసుకుని, తీరా పెళ్లి సమయానికి పరారయ్యేవారు. ఇలా యువతి.. ఐదుగురు యువకులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 
 
అయితే, ఈ వ్యవహారంలో వధువుతో పాటు.. మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments