Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత మంచి మనస్సో... మేకకు కూడా టిక్కెట్ కొనుగలు చేసిన వృద్ధురాలు..

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (12:42 IST)
చాలా మంది విద్యావంతులు సైతం రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. ఇక వృద్ధులు, స్వామీజీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. చాలా మేరకు టిక్కెట్ లేకుండానే ప్రయాణం చేస్తుంటారు. అయితే, ఓ గ్రామీణ మహిళ మాత్రం తమ దంపతులతో పాటు... తమ పెంపుడు మేకకు కూడా ప్రయాణ టిక్కెట్ తీసుకుంది. ఈ విషయం రైలు టీసీ తనిఖీల్లో బయటపడింది. దీన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వృద్ధురాలు చేసిన పని వైరల్ అయింది. ఎంత గొప్ప మనస్సో అంటూ ఆ వృద్ధురాలిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగినట్టుగా భావిస్తున్న ఈ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియోను అవనీశ్ శరణ్ అనే ప్రభుత్వ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు. టిక్కెట్ చెక్కింగ్ కోసం వచ్చిన టీటీఈ.. మహిళను చూసి టిక్కెట్ ఉందా అని అడిగారు. ఆమె పక్కనే ఉన్న మరో వ్యక్తి టీటీఈకి టిక్కెట్ చూపించాడు. ఆ తర్వాత మహిళ పక్కన ఉన్న మేక ఉండటం చూసి ఆయన మేక కోసం టిక్కెట్ కొన్నారా? అని అడిగారు. దీనికి అవునని నవ్వుతూ ఆ వృద్ధురాలు సమాధానమిచ్చి, టిక్కెట్‌ను కూడా చూపించింది. 
 
ఈ సంవాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. మేకకు కూడా టిక్కెట్టు కొని తన నిజాయతీని సగర్వంగా ప్రకటించుకుందని అనేక మంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఆమె నిజాయతీని వేనోళ్లు ప్రశంసించారు. కట్టుదాటితేగానీ గిట్టుబాటుకాదనే వారున్న ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు ఉండటం గొప్ప విషయమేనని కొందరు కామెంట్స్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు 3,500 అడుగులు వేయాల్సిందే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments