జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్. పెంపుడు జంతువులు కూడా ఇకపై రైలులో ప్రయాణించవచ్చు. రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.
ఇందు కోసం ముందుగా ప్రయాణికులు స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్‌లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్‌లో ఒక బాక్స్‌లో కూడా పెంపుడు జంతువులను తరలించే వీలుంది.