Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వాసుపత్రిలో మహిళా రోగిపై అత్యాచారం

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (14:33 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రక్తపోటు సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళపై ఆస్పత్రిలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం అజ్మీర్‌లో జరిగింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, అజ్మీర్‌​కు చెందిన ఓ 23 ఏళ్ల మహిళ.. గత కొద్దిరోజులుగా రక్తపోటు సమస్యతో బాధపడుతోంది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల వైద్యం కోసం స్థానికంగా ఉన్న జేఎల్​ఎన్​ ప్రభుత్వాసుపత్రికి తన సోదరుడితో వెళ్లింది. ఆమెను ఆస్పత్రిలో వదిలిపెట్టి ఇతర పనిమీద బయటకు వెళ్లాడు. 
 
ఇదే అదనుగా తీసుకుని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్​ ఉద్యోగి రాజేశ్​ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి సోదరుడు సాయంత్రం వచ్చి చూసేసరికి ఆమె నిస్సహాయ స్థితిలో వుంది. కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేదు. దీంతో వెంటనే అతడు వేరే ఆసుపత్రికి ఆమెను తరలించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments