Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్ ఫాలోవర్లలో టాప్ లీడర్‌గా నిలిచిన మోదీ.. ట్రంప్‌నే నెట్టేశారు..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌ ఫాలోవర్లో ప్రపంచంలోనే టాప్ లీడర్‌గా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవతరించారు. ఫేస్‌బుక్‌ ఫాలోవర్లలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నే మోదీ

Webdunia
శనివారం, 27 మే 2017 (09:56 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌ ఫాలోవర్లో ప్రపంచంలోనే టాప్ లీడర్‌గా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవతరించారు. ఫేస్‌బుక్‌ ఫాలోవర్లలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నే మోదీ వెనక్కి నెట్టారు. ఎఫ్‌బీలో డొనాల్డ్ ట్రంప్‌ను అనుసరిస్తున్న వారికంటే మోదీని అనుసరించే వారి సంఖ్యే అధికమని తేలింది. తద్వారా మోదీ ఫాలోవర్ల సంఖ్య 4.17 కోట్లకు చేరుకుంది.
 
మే 2014లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు 1.4 కోట్లు ఉన్న మోదీ ఫాలోవర్ల సంఖ్య ప్రస్తుతం 4.17 కోట్లకు చేరుకున్నట్టు ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ ప్రకటించారు. నోట్ల రద్దు వంటి విప్లవాత్మక చర్యలను కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్నప్పటికీ మోదీ ప్రాభవం ఏమాత్రం తగ్గలేదని.. ఆయన క్రేజ్ అమాంతం పెరిగిందే తప్ప తగ్గలేదని అంకి దాస్ వెల్లడించారు. ఇక మోదీ తర్వాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, స్మృతి ఇరానీ, జనరల్ వీకే సింగ్, పీయూష్ గోయల్, అరుణ్ జైట్లీ‌లకు ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments