Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కట్టడికి విప్రో భారీ విరాళం.. టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (14:26 IST)
దేశంలో కరోనా వైరస్ సంక్షోభాన్ని కట్టడిచేయడం కోసం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ భారీ విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మరియు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్లతో కలిసి కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం రూ. 1,125 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్ రూ. 100 కోట్లు, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ రూ. 25 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలుస్తూ కరోనా పట్ల ప్రజల్లో అవగాహన నింపుతున్నారు. సీఎం, పీఎం సహాయ నిధులకు ఆర్థిక సాయం చేయడమే గాక సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేశారు. చిరంజీవి సారథ్యంలో ఏర్పడిన ఈ ఛారిటీకి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు తెలుగు సినీ తారలు.
 
ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ సహా ఎందరో సినీ హీరోలు ఈ ఛారిటీకి భారీ విరాళాలు అందించగా.. తాజాగా హీరో శ్రీకాంత్ ముందుకొచ్చారు. తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందజేశారు. సరైన సమయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకున్న పెద్దలందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments