Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలాల్లో నాట్లు వేయాల్సింది పోయి.. రోడ్లపైకి వచ్చి చలికి వణుకుతూ..?: సోనూ సూద్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (17:39 IST)
కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలిచిన హీరో సోనూసూద్ ప్రస్తుతం రైతులకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. పంజాబ్‌ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ ఆందోళనను కొనసాగిస్తున్న ఢిల్లీ రైతుల ఆందోళనపై నటుడు సోనూసూద్‌ స్పందించారు.
 
'వి ది ఉమెన్‌ ' అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్‌ మాట్లాడుతూ.. ''ఈ విషయంలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని వాదించాలనుకోవడం లేదు. అయితే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. రైతులతో నాకు మంచి అనుబంధం ఉంది. పంజాబ్‌లో పుట్టి పెరిగాను. రైతులు చేస్తున్న ఈ పోరాటంలో కొంత మంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు. పొలాల్లో నాట్లు వేస్తూ ఉండాల్సిన రైతులు .. వారి కుటుంబంతో కలిసి రోడ్లపై వచ్చి చలికి వణుకుతున్నారు. ఇంకా ఎన్నిరోజులు రైతులు ఈ పరిస్థితుల్లో ఉంటారో తెలియడం లేదు. అయితే ఈ దృశ్యాల్ని ఎప్పటికీ మరచిపోలేం'' సోనూసూద్‌ ఆవేదన చెందారు.
 
కాగా  శనివారంతో రైతుల ఆందోళన 24వ రోజుకు చేరింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, సినిమా తారలు, విపక్ష నేతలు రైతులకు మద్దతు తెలుపుతున్నారు. ఈ జాబితాలో సోనూ సూద్ కూడా చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments