Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రహదారుల దిగ్బంధానికి వేలాదిగా తరలివస్తున్న రైతులు... భారీగా పోలీసులు

Advertiesment
రహదారుల దిగ్బంధానికి వేలాదిగా తరలివస్తున్న రైతులు... భారీగా పోలీసులు
, ఆదివారం, 13 డిశెంబరు 2020 (13:28 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రమవుతోంది. ఈ కొత్త చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గలేదు. దీంతో రైతులు కూడా తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా, జాతీయ రహదారుల దిగ్బంధానికి రైతులు పిలుపునిచ్చారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను కేంద్రం మొహరిస్తోంది. 
 
కేంద్రం మొండివైఖరికి నిరసనగా నేటి నుంచి ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు వెళ్లే రహదారుల్ని దిగ్బంధిస్తామని రైతులు హెచ్చరించారు. దీంతో అక్కడకు అదనపు బలగాలు చేరుకున్నాయి. ఢిల్లీ, జైపూర్ మార్గంలో ఆందోళనలకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ దారిలోనూ పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు రాకుండా చేస్తామని పోలీసులు చెప్పారు. 
 
మరోవైపు, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం రాజస్థాన్‌లోని షాజహాన్‌పుర్‌ నుంచి ఢిల్లీ, జైపూర్ జాతీయ రహదారి మీదుగా వేలాది సంఖ్యలో ట్రాక్టర్లతో రైతులు చలో ఢిల్లీకి సిద్ధమయ్యారు. భారీగా అక్కడి నుంచి తరలి వెళ్లి రేపు ఉదయం నాటికి సింఘు సరిహద్దుకు చేరుకుని రైతు నేతలంతా నిరాహార దీక్ష చేయనున్నారు. 
 
రేపు వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా రైతులు నిరసనల్లో పాల్గొననున్నారు. ఈ నెల 19లోగా నూతన వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ఇప్పటికే రైతులు ప్రకటించారు. ఇక రైతుల ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో గత 17 రోజుల్లో 11 మంది చనిపోవడం ఉద్రిక్తతలను పెంచుతోంది. ఎంతమంది రైతులు తమ ప్రాణాలను బలివ్వాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
 
నిజానికి తమ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమైన రైతు సంఘాల నేతలు, కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమేనని, తొలుత ఈ చట్టాలని రద్దు చేస్తామని ప్రకటిస్తే, ఆపై మాత్రమే మిగతా అంశాలపై తాము చర్చిస్తామన్నారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన రైతు నేత కన్వల్ ప్రీత్ సింగ్, రాజస్థాన్ నుంచి కూడా రైతులు రానున్నారని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ వెడ్డింగ్ : వెబ్ కాస్టింగ్ ద్వారా వివాహం... ఫుడ్ డోర్ డెలివరీ...