Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెట్టువీడి చర్చలకు రండి - రైతులను చర్చలకు కేంద్రం ఆహ్వానం

బెట్టువీడి చర్చలకు రండి - రైతులను చర్చలకు కేంద్రం ఆహ్వానం
, శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:24 IST)
కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులను కేంద్రం మరోమారు చర్చలకు ఆహ్వానించింది. బెట్టువీడి చర్చలకు రావాలని కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పిలుపునిచ్చారు. 
 
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో సంప్ర‌దింపుల త‌ర్వాత ప్ర‌భుత్వం కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను రూపొందించింద‌ని, రైతుల జీవితాల్లో మార్పు తేవాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని, ఇన్నేళ్లు జ‌రిగిన అన్యాయాన్ని తొల‌గించాల‌న్నదే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. 
 
రైతులు ఉత్త‌మ జీవితాన్ని పొందాల‌ని, వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మార్చ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌న్నారు. చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌ల‌ను చేసేందుకు అంగీక‌రించామ‌ని, కానీ త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌పై రైతు సంఘాలు ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేద‌ని, అయితే తాము పంపిన ప్ర‌తిపాద‌న‌లను రైతు సంఘాలు వ్య‌తిరేకించినట్టు తెలిపారు. 
 
ఒక‌వేళ రైతులు త‌మ‌తో మాట్లాడాల‌నుకుంటే, తాము సిద్ధంగా ఉన్న‌ట్లు తోమ‌ర్ వెల్లడించారు. చ‌ర్చ‌ల కోసం రైతుల నుంచి ఎటువంటి ప్ర‌తిపాద‌న రాలేద‌న్నారు. ప్ర‌తిష్టంభ‌న‌ను తొల‌గించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని తాము రైతు సంఘాల‌ను కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. 
 
అభ్యంత‌రాలు ఏమైనా ఉంటే వాటిని వారు వ్య‌క్తం చేయాల‌న్నారు. రైతుల‌కు ఉన్న అభ్యంత‌రాల‌పై తాము సూచ‌న‌లు చేశామ‌ని, వారు నిర‌స‌న మార్గాన్ని వీడి చ‌ర్చ‌ల‌పై దృష్టి పెట్టాల‌న్నారు. చ‌ర్చ‌ల త‌ర్వాత చ‌ట్టాల్లో మార్పులు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని మంత్రి తోమ‌ర్ చెప్పారు.
 
రైతులు ఉద్యమ పంథాను వీడాలని, ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. చర్చల విషయంలో ఏర్పడ్డ  ప్రతిష్టంభనను రైతులు తొలగించాలని ఆయన కోరారు. రైతుల ఉద్యమంతో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు వెంటనే తమ ఉద్యమాన్ని విరమించుకొని, చర్చలు జరపాలని కోరారు. 
 
టిక్రీ సరిహద్దుల వద్ద రైతుల ఆందోళనలో షర్జీల్ ఇమామ్ ఫొటో కనిపించడంపై తోమర్ స్పందిస్తూ.. 'ఈ ఉద్యమం కనీస మద్దతుధర, మండీలు, రైతులకు చెందిన ఉద్యమం. మరి షర్జీల్ ఇమామ్ పోస్టర్ రైతు సమస్య ఎలా అవుతుంది. ఇది అత్యంత ప్రమాదమైంది. దృష్టి మరల్చడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు' అని తోమర్ మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో 'ఎన్టీఆర్' కావాలని... సైకిల్ గుర్తుపై కన్నేసిన 'బాషా'